ఏకాంతాన నా మనసు సోకాంతాన పడకుండా
ఏకాంతాన నా మనసు
సోకాంతాన పడకుండా
తప్పించుము నా యేసు
దివ్య బలమా ఆత్మ వరమా
1. ఇది ఎందుకు జరగాలని ఇలా ఎవరికీ కాలేదని
ఇక ఎందుకు బ్రతకాలని నేనెవరికీ కొరగానని
ప్రశ్నించకుండానే విధేయత చూపాలి
మనసునొచ్చు కోకుండా నిన్ను వెంబడించాలి
సమస్తము సహించాలని…
2. నేనడుగగా ఏదైనను అది పొందని చిత్తంబైనను
ఇక విడువగా మనసైనది నా ప్రాణమునకు ప్రియమైనది
నిగ్రహమునిమ్మయ్యా – ఆగ్రహము మాన్పయ్యా
జగడమందు వద్దయ్యా జడియకుండ
నిమ్మయ్యా నీ చిత్తమే సిద్ధించనీ….
3. ఒక రోజున ముగిసేనులే ఈ జీవిత జంఝాటన
పొరపాటున గుర్తుండదే పరలోకపు గవి చేరగా
ఎప్పుడయ్యా యేసయ్యా అంతగొప్ప సందెవేళ
ఎక్కడయ్యా యేసయ్యా నిన్ను చేరు సంధ్యవేళ
ప్రశాంతమై నిలవాలనే…