ఊహించగలనా !
ఊహించగలనా ఈ ప్రణాళికను
యోగ్యతలేని నన్ను కరుణించిన కృపను ||2||
1 . పాపశాప భారంతో సొమ్మసిల్లియుంటిని – ఎటుపయనించాలో తెలియక యుంటిని
(ప్రాణమిచ్చినానంటూ సేదదీర్చుకోమంటూ – తెలుసుకో నన్నంటూ గమ్యమే నేనంటూ
వచ్చావ యేసయ్యా నన్నే (ప్రేమించి – తెచ్చావ రక్షణనే నను కనికరించి ||ఊహించ||
2. మనసున్న మారాజా పరలోక రారాజా – సన్నుతించేనయ్యా నిన్నే నానాధా
పిలుచుకున్నావయ్యా మలచుకున్నావయ్యా – నీ సేవ భారంతో నన్ను నింపావయ్యా
వచ్చాను యేసయ్యా నీ పాద సన్ఫిధిక్ – తెచ్చాను యేసయ్యా నా అర్చ్హణలన్ని ||ఊహించ||
౩. చాలు చాలు యేసయ్యా నీవే మేలు యేస్సయ్య- చింతలన్ని ఛేదించిచెంత చేర్చినావయ్య
నిన్ను గాక మరి ఏదీ అడుగలేను నా స్వామీ- నిన్ను కలిగి జీవించి ధన్యమౌదునో స్వామీ
ఇదిగో నా జీవితం ఇక నీ కంకితం – నేను కాదు నా యందు నీవే ఉండి నడిపించు ||ఊహించ||