నిర్ణయం నీదే..!
నిర్ణయం నీదే ఎన్నుకుంటావా
జీవ మార్గమేదో మరణ మార్గమేదో యోచించుమా ||2||
1 .మనిషి చేసినా మట్టి బొమ్మలో జీవమున్నదా
నిన్ను చేసిన అద్వితీయత అందు నిలచునా
యోచించుమా….. ||నిర్ణయం నీదే||
2. నీవు చేసిన పాపమమంతయు శాపమే కదా
భిక్షమేసిన జపము చేసినా నిన్ను విడచునా
గమనించుమా….. ||నిర్ణయం నీదే||
3.శిలువ దారిలో యేసు రక్తమే నీ విమోచన
చెంత చేరిన విశ్వసించినా నీకు రక్షణ
గమనించుమా….. ||నిర్ణయం నీదే||