నా దేవా నా రాజా..!
నా దేవా నా రాజా నా ప్రియుడా సుందరుడా
ధవళా వర్ణుడా రత్నా వర్ణుడా
పదివేలమందిలో అతి కాంక్షనీయుడా
1.నా సహవాసులందరూ నా మీద కోపగించి
(ద్రాక్షతోట కావలికత్తెగా నన్ను విడిచి వెళ్ళిపోయిరి – నల్లని దాననని చిన్న చూపు చూతిరే
ధవళ వర్ణుడా నన్ను నీ నీడ చేర్చుమా ||నా దేవా నా రాజా||
2. పరలోక సింహాసనము నన్ను చేర నిచ్చుట కొరకై
కలువరిగిరి చేరుకుంటివి పరమ బంధమేర్చరచితివి – గమనించు కొంటినయ్యా వింతైన త్యాగమును
విలువైన మర్మమేదో నన్ను ఆవరించెను ||నా దేవా నా రాజా||
3. పరిశుద్ధ పరిశుద్ధుడా దివ్య జ్ఞాన సంపూర్ణుడా
నీ పాద పద్మములే చలువరాతి స్థంభములు – రత్న భూషితమైన స్వర్ణగోళ కరములు
నీల ఖచిత రత్నముకంటే చిత్రమైన వాడవు ||నా దేవా నా రాజా||